←Back
వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం
శ్రీవరలక్ష్మి పూజ సామగ్రి
పసుపు,
కుంకుమ,
గంధం,
విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు,
ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు,
తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ,
మామిడి ఆకులు,
ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం,
ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం,
పంచామృతాలు.
దీపపు కుందులు,
ఒత్తులు, నెయ్యి.
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి.
ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు.
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది.
సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’
శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం.
శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి
లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.
వ్రత విధానం
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి.
అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి,
తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
తోరం తయారు చేసుకోవడం:
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి.
ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు
లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో
ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద
ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి.
ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
సంకల్పం :
ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _______ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే శుక్లపక్షే _______ తిథౌ ____వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.
పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం
క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం,
ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం,
వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ
యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)
శ్రీ మహా లక్షీ మహా పరాంబికా పరాదేవతా పూజాంచ కర్మ అద్య కరిష్యే ||
దీపారాధన
దీపానాదం క్రుత్వా |
త్రీణి త్రీణివై దేవానాం వ్రుద్దాని త్రీణిచ్చందాగుమ్ సిత్రీణిసవనాని త్రేహిమేలోకాః| విద్యామేవతత్వీర్యేషులోకేషు ప్రతితిష్ఠతి||
రక్తద్వాదశయుక్తాయ దీపనాదాయనమోసమః |
దీపం ప్రజ్వాల్యా దీపమలంక్రుత్య||
బోదీప దేవీ రుావస్వం కర్మసాక్షీయవిజ్ఞ కృత్ |
యావత్ పూజా సమాప్తస్య తావత్త్వం సుస్ధిరో భవ ||
గణపతి ప్రార్దన
ఓం గణానా”మ్ త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనామ్ ఉపమశ్ర’వస్తవమ్|
జ్యేష్ఠరాజంబ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ ||
ప్రణో’ దేవీ సర’స్వతీ | వాజే’భిర్ వాజినీవతీ | ధీనామ’విత్ర్య’వతు ||
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||
నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||
కలశారాధన
కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మ , మధ్యే మాతృగణా స్మృఅతాః
కుక్షౌతు సాగరాఃసర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో௨ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆ కలశేషుదావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్త్ధెర్య జ్ఞేషువర్థతే
అపోవా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః , ప్రాణావా ఆపః ,
పశవ ఆపో௨న్నమాపో ௨ మృతమాప , స్సమ్రాడాపో ,విరాడాప , స్స్వరాడాప ,
శ్ఛందాగ్ంష్యాపో , జ్యోతీగ్ం ష్యాపో , యుజూగ్‌ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్మ్
గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే௨స్మిన్ సన్నిధిం కురు
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ
భాగీరధీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః
ఆయాస్తుమమదురితక్షయ కారకాః శ్రీ విఘ్నేశ్వర పూజార్థం శుద్ధోదకేన దేవం ,ఆత్మానం , పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య
ధ్యానమ్
యావిద్యా శివకేశవాది జననీం యావైజగన్మోహినీ |
యాపంచప్రణవ ద్విరేభనళినీ యాచిత్తకళామాలినీం ||
యాబ్రహ్మాదీ పిపీలికానందైకసందాయినీం |
సాపాయా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
||ధ్యయామి ధ్యానమ్ సమర్పయామి || || 1 ||
ఆవాహనం
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
||ఆవాహయామి మ్ ఆవాహనం సమర్పయామి || || 2 ||
ఆసనం
తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| సువర్ణ రత్న ఖచిత హేమ శంహాసనం సమర్పయామి || || 3 ||
పాదయో పాద్యం
అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| పాదయో పాద్యం సమర్పయామి || || 4 ||
హస్తయో అఘ్యం
కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |
పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| హస్తయో అఘ్యం సమర్పయామి || || 5 ||
ముఖే సుధఆచమనీయం
చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యేஉలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| ముఖే సుధఆచమనీయం సమర్పయామి || || 6 ||
స్నానం
ఆదిత్యవ’ర్ణే తపసోஉధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షోஉథ బిల్వః |
తస్య ఫలా’ని తపసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ||
యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
పంచామృత స్నానం
పాలతో
ఆప్యాయస్వ సమేతుతే విశతస్సోమవృష్టియం|
భవావాజస్య సంగధే|| ||క్షీరేణ స్నపయామి||
పెరుగుతో
దధిక్రావ్‌ణ్ణో అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః |
సురభినో ముఖాకరత్ర్పణ ఆయుగ్ంషి తారిషత్ || ||దధ్నా స్నపయామి ||
నేతితో
శుక్రమసి జ్యోతిరసి తేజో௨సి దేవోవస్సవితో త్ప్నా|
త్వఛ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః|| || ఆఙ్యేన స్నపయామి ||
తేనెతో
మధువాతా ఋతాయతే మధిక్షరంతి సింధవః|మాధ్వీర్న స్సంత్యోషధీః మధునక్త ముతోషసి||
మధుమత్పార్థివగ్ం రజః మధుద్యౌరస్తునః| పితా మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః|| || మధునా స్నపయామి ||
శర్కరతో
స్వాధుఃపవస్య దివ్యయ జన్మనే స్వాదురింద్రాయ సుహావీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః ||శర్కరయా స్నపయామి ||
శుద్ధోధకముతో
అపోహిష్ఠా మయోభువఃతాన ఊర్జేదధాతన మహేరణాయచక్షుసే యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః ఉశతీరివమాతరః తస్మారంగమామవః యస్యక్షయాయ జిన్వధ అపోజనయధాచనః
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| స్నానం సమర్పయామి || || 7 ||
|| స్నానాతరే సుధఆచమనీయం సమర్పయామి ||
వస్త్ర్రం
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతోஉస్మి’ రాష్ట్రేஉస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| వస్త్ర్రయుజ్ఞ్మం సమర్పయామి || || 8 ||
యజ్ఞోపవీతం
క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||
యజ్ఞోపవీతం పరమం పవిత్రం | ప్రజాపతేర్యసహజం పురస్తాత్ ||
ఆయుష్యమగ్ర్యం ప్రతిముచ శుభ్రం|యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| యజ్ఞోపవీతాం ధారయామి || || 9 ||
గంధం
గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| శ్రీ గంధం ధారయామి || || 10 ||
ఆబరణం
మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
||ప్రధమ ఆబరణం సమర్పయామి || || 11 ||
పుష్పై పూజయామి
కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||
అధ అంగపూజ
ఓం ఐం హ్రీం శ్రీం ||
ఓం దుర్గాదేవీశ్వర్యై నమో నమః పాదౌ పూజయామి
ఓం హిమగిరి నందిన్యై నమో నమః గుల్భౌ పూజయామి
ఓం అపర్ణాయై నమో నమః జంఘే పూజయామి
ఓం సర్వమంగళాయై నమో నమః జానునీ పూజయామి
ఓం పరమేశ్వర మహేశ్వర్యై నమో నమః కటిం పూజయామి
ఓం సకల జగదాధారిణ్యై నమో నమః ఆధారం పూజయామి
ఓం పద్మనాభ ప్రియాయై నమో నమః నాభిం పూజయామి
ఓం కుక్షిస్దాఖిల భువనాయై నమో నమః ఉదరం పూజయామి
ఓం జగన్మాత్రే నమో నమః నేత్రౌ పూజయామి
ఓం విష్ణువక్షస్ధల నివాసిన్యై నమో నమః వక్షస్ధలం పూజయామి
ఓం శివా నమోయై నమో నమః హృదయం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమో నమః స్కంథౌ పూజయామి
ఓం పద్మహస్థాయై నమో నమః హస్తౌ పూజయామి
ఓం శ్రీకంఠ కుటుంబిన్యై నమో నమః కంఠం పూజయామి
ఓం వేదవేదాంత ప్రధాన భూమ్యై నమో నమః మఖం పూజయామి
ఓం చాంపేయాభనాశికాయై నమో నమః నాశకాం పూజయామి
ఓం కమల పత్రాక్ష్యై నమో నమః నేత్రే పూజయామి
ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజితా నమో నమః శరః పూజయామ
వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
||నానావిధ పరిమళ పత్ర పూష్పాక్షత కుంకుమైశ్చ పూజయామి || || 11 ||
ధూపంమాగ్రాపయామి
ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| ధూపంమాగ్రాపయామి || || 12 ||
దీపం దర్శయామి
ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| దీపం దర్శయామి || || 13 ||
|| ధూప దీపానంతరం సుధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం
ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |పాచిక చండాలీ త్రుప్యతు||
ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |అనాచార చండాలీ త్రుప్యతు||
ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |దర్శన చండాలీ త్రుప్యతు||
ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |స్పుహనీయ చండాలీ త్రుప్యతు||
ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |సర్వాః చండాలీ త్రుప్యంతు త్రుప్యంతు||
ఓంతాక్ష్యాక్షా క్షిప క్షిప స్వాహా
ఓంతాక్ష్యాక్షా క్షిప క్షిప స్వాహా
ఓంతాక్ష్యాక్షా క్షిప క్షిప స్వాహా
ఓంఅమృతే. అమృతోద్బవేఅమృ తకళే హే హ్యేయిపరమేశ్వరీ ఓంజూంసహ స్వాహా
ఓంఅమృతే. అమృతోద్బవేఅమృ తకళే హే హ్యేయిపరమేశ్వరీ ఓంజూంసహ స్వాహా
ఓంఅమృతే. అమృతోద్బవేఅమృ తకళే హే హ్యేయిపరమేశ్వరీ ఓంజూంసహ స్వాహా
ఓంభూర్భూవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి
అమృతమస్తు అమృతోపస్తరణమసి
|| మహా లక్షీ నమో నమః నైవేద్యం సమర్పయామి||
ఓం ప్రాణయస్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఉదానాయ స్వాహా
ఓం సమనాయ స్వహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
సధ్యోజాతముఖాయైస్వాహా
వామదేవముఖాయైస్వాహా
అఘోరముఖాయైస్వాహా
తత్పురుషముఖాయైస్వహా
ఈశానముఖాయైస్వాహా
భ్రహ్మణేస్వాహా
భ్రహ్మాణ్యైస్వాహా
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్-రక్షాళయామి
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యోஉశ్వా”న్, విందేయం పురు’షానహమ్ ||
పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః
|| తాంబూలం సమర్పయామి || || 14 ||
|| తాంబూల చర్వనాతరంసుధ ఆచమనీయం సమర్పయామి ||
వేదాహమే’తం ఇతి కర్పూర నీరాజనం
వేదాహమే’తం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సస్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వాஉభివదన్, యదాஉஉస్తే” ||
సాంమ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం| పారమేష్టిగ్ంరాజ్యం మహారాజ్యమాధిపధ్యం||
|| నీరాజనం నాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి || || 15 ||
మంత్ర పుష్పం
ధాతా పురస్తాద్యము’దాజహార’ | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చత’స్రః |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||
యఙ్ఞేన’ యఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రథమాన్యా’సన్ |
తే హ నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||
అద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
తస్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’నమగ్రే” ||
వేదాహమేతం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా’ విద్యతేஉయ’నాయ ||
ప్రజాప’తిశ్చరతి గర్భే’ అంతః | అజాయ’మానో బహుధా విజా’యతే |
తస్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం పదమిచ్ఛంతి వేధసః’ ||
యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచాయ బ్రాహ్మ’యే ||
రుచం’ బ్రాహ్మం జనయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||
హ్రీశ్చ’ తే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |
ఇష్టం మ’నిషాణ | అముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ ||
ఓం రాజాధిరాజాయ’ ప్రసహ్య సాహినే” | నమో’ వయం వై”శ్రవణాయ’ కుర్మహే | స మే కామాన్ కామ కామా’య మహ్యమ్” | కామేశ్వరో వై”శ్రవణో ద’దాతు | కుబేరాయ’ వైశ్రవణాయ’ | మహారాజాయ నమః’ ||
ఓం” తద్బ్రహ్మ | ఓం” తద్వాయుః | ఓం” తదాత్మా |
ఓం” తద్సత్యమ్ | ఓం” తత్సర్వమ్” | ఓం” తత్-పురోర్నమః ||
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్‍మ్
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం’ ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతీరసోஉమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోஉధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ |
తద్విష్నోః పరమం పదగ్‍మ్ సదా పశ్యంతి
సూరయః దివీవచక్షు రాతతం తద్వి ప్రాసో
విపస్యవో జాగృహాన్ సత్సమింధతే
తద్విష్నోర్య-త్పరమం పదమ్ |
ఋతగ్‍మ్ సత్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ |
ఊర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పాయ వై నమో నమః’ ||
ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి |
తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ ||
|| మంత్ర పుష్పాజలింసమర్పయామి || || 16 ||
ఆత్మ ప్రదక్షణ
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ| తాని తాని వినశ్యంతి ప్రదక్షణ పదే పదే ||
పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాప సంభవ |పాహిమాం కృపయా గౌరీ శరణాగతవత్సలే ||
అన్యదాశరణంనాస్ధి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా ||
|| అనేన ఆత్మ ప్రదక్షణనమస్కారాంసమర్పయామి ||
సాష్ఠాంగదండప్రణమం ణామాని
ఉరసా శిరసా ద్రుశ్యా మనసా వచసా తద| పభ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామష్ఠగ మచ్చతే ||
|| అనేన సాష్ఠాంగదండప్రణమం ణామాని సమర్పయామి ||
అపరాధ నమస్కారం
అపరాధ సహస్రాణి క్రియంతేఅహర్నిశంమయా | దాశోహంఇతిమామత్త్వా క్షమస్వ పరమేశ్వరీ||
|| అనేన అపరాధ నమస్కారం సమర్పయామి ||
పునః పూజాం కరిష్యే
ఛత్రమాఛ్చాదయమి |చామరంవీచయామి ||
నృత్యందర్సయామి| గీతంశ్రావయామి ||
ఆందోళితానారోహయామి|అశ్వానరోహయామి||
గజానారోహయామి| సమస్థరాజోపచార భక్య్తుపచార శక్త్యుపచారాం సమర్పయామి||
||వాయుధ్యంఘోషయామి||
ఈశ్వరార్పణం
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిఘు|
న్యూన్యం సంపూర్నతాం యాతి సద్యో వందే పరమేశ్వరీ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ|
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే||
అనయా యధాశక్తి పూజయా భగవతీ సర్వాత్మకః|
శ్రీ మహా లక్షీ పాదారవిందార్పణమస్తు||
సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా | సర్వగుంహరతుమేపాపం దూర్వా దుఃస్వప్ననాశనీ ||
కాండాత్కాండాత్పరోహంతీ పరుషప్పరుషప్పరీ |ఏవానోదూర్వే ప్రతనుసహస్రేనశతేనచ||
యాశతేనప్రతనుసహస్రేన విరోహసి|తస్యాస్తే దేవీఇష్టకేవిధేమహవిషావయం||
అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతేవసుంధరా |శిరసాధార ఇష్యామి రక్షస్వమాం పదే పదే ||
ఋతగ్ఁ సత్యం పరంబ్రహ్మ పురషంకృష్ఙపింగళం| ఊర్ధ్వరేతంవిరూపాక్షంవిశ్వరూపాయవైనమః ||
గౌరీమిమాయసలిలీనిదక్షస్యేకపదీద్విపదీ సాచతుష్పదీ |అష్టాపదీ నవపదీ బహూషి సహస్రాక్షరా పరమేవ్యోమన్ ||
మమ వ్రతం సువ్వ్రతంమస్తు|నూనాతిరిక్తం సర్వం సగుణంకరొతు||
దేవ దేవ్యాః అనంత భోగో అన్తు|యత్ పాపం తత్ ప్రతిహతమస్తు||
అధర్మశ్య నాసోస్త| ధర్మశ్యవిజయోస్తు||
శత్రభిః ఆక్రమిత భారత భూభాగ స్వాయుక్తీ కరణ సిధిరస్తు ||
దేవ దేవ్యాః సకల సింహాసనేస్వర్యాఃరాజరాజేశ్వర్యాః పరబ్రహ్మణః పట్టమహిష్యాః
సారూప్య సామీప్య|| సాయుధ్యసిధ్ది ద్వారా మోక్షాధికారసిధ్ధిరస్తు||
తోరపూజ
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
లోకమాత్రేనమః తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వ్రత కథా ప్రారంభం
పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను .శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని
శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.
అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.
