No photo

←Back

షోడషోపచార పూజ

గురువందనం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం ।

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః।।

శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం ||

శరీరశుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః ,ఓం విష్ణవే నమః,ఓం మధుసూదనాయ నమః ,ఓం త్రివిక్రమాయ నమః,

ఓం వామనాయ నమః ,ఓం శ్రీధరాయ నమః ,ఓం హృషీకేశాయ నమః ,ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః ,ఓం సంకర్షణాయ నమః ,ఓం వాసుదేవాయ నమః ,ఓం ప్రద్యుమ్నాయ నమః ,ఓం అనిరుద్ధాయ నమః,ఓం పురుషోత్తమాయ నమః ,ఓం అధోక్షజాయ నమః ,ఓం నారసింహాయ నమః ,ఓం అచ్యుతాయ నమః ,ఓం జనార్ధనాయ నమః ,ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః ,ఓం శ్రీకృష్ణాయ నమః,ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే” ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | 
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే; శ్రీసైలశ్చ వాయువ్య ప్రదేశే , కృష్ణా గోదావర్యోర్ మధ్య దేశే శోభన/ స్వ గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః

శ్రీ విష్ణు పూజాంచ కర్మ అద్య కరిష్యే ||

దీపారాధన

దీపానాదం క్రుత్వా |

త్రీణి త్రీణివై దేవానాం వ్రుద్దాని త్రీణిచ్చందాగుమ్ సిత్రీణిసవనాని త్రేహిమేలోకాః| విద్యామేవతత్వీర్యేషులోకేషు ప్రతితిష్ఠతి||

రక్తద్వాదశయుక్తాయ దీపనాదాయనమోసమః |

దీపం ప్రజ్వాల్యా దీపమలంక్రుత్య||

బోదీప దేవీ రుావస్వం కర్మసాక్షీయవిజ్ఞ కృత్ |

యావత్ పూజా సమాప్తస్య తావత్త్వం సుస్ధిరో భవ ||

గణపతి ప్రార్దన

ఓం ణానా”మ్ త్వా ణప’తిగ్‍మ్ హవామహే విం క’వీనామ్ ఉమశ్ర’వస్తవమ్|

 జ్యేష్ఠరాజంబ్రహ్మ’ణాం బ్రహ్మణస్ప ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీ సాద’నమ్ ||

ప్రణో’ దేవీ సర’స్వతీ | వాజే’భిర్ వాజినీవతీ | ధీనామ’విత్ర్య’వతు ||

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||

ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః 
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః 
ఓం శచీపురందరాభ్యాం నమః 
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః 
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||

నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

కలశారాధన


కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మ , మధ్యే మాతృగణా స్మృఅతాః

కుక్షౌతు సాగరాఃసర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో௨ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆ కలశేషుదావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్త్ధెర్య జ్ఞేషువర్థతే
అపోవా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః , ప్రాణావా ఆపః ,
పశవ ఆపో௨న్నమాపో ௨ మృతమాప , స్సమ్రాడాపో ,విరాడాప , స్స్వరాడాప ,
శ్ఛందాగ్ంష్యాపో , జ్యోతీగ్ం ష్యాపో , యుజూగ్‌ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్మ్

గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే௨స్మిన్ సన్నిధిం కురు

కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ
భాగీరధీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

ఆయాస్తుమమదురితక్షయ కారకాః శ్రీ విఘ్నేశ్వర పూజార్థం శుద్ధోదకేన దేవం ,ఆత్మానం , పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య

ధ్యానమ్

నమస్తుభ్యం మహా దేవా | నారాయణ కృపనిదే||

పాహిమాం ఫణి శైలేశ | భక్త బంధో దయానిధే||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

||ధ్యయామి ధ్యానమ్ సమర్పయామి || || 1 ||

ఆవాహనం

హస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః హస్ర’పాత్ |
స భూమిం’ విశ్వతో’ వృత్వా | అత్య’తిష్ఠద్దశాంగుళమ్ ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

||ఆవాహయామి మ్ ఆవాహనం సమర్పయామి || || 2 ||

ఆసనం

పురు’ష వేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
తామృ’త్వ స్యేశా’నః | దన్నే’నాతిరోహ’తి ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| సువర్ణ రత్న ఖచిత హేమ శంహాసనం సమర్పయామి || || 3 ||

పాదయో పాద్యం

తావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’శ్చ పూరు’షః |
పాదో”உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| పాదయో పాద్యం సమర్పయామి || || 4 ||

హస్తయో అఘ్యం

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే భి ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| హస్తయో అఘ్యం సమర్పయామి || || 5 ||

ముఖే సుధఆచమనీయం

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | శ్చాద్-భూమిమథో’ పురః ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| ముఖే సుధఆచమనీయం సమర్పయామి || || 6 ||

స్నానం

యత్పురు’షేణ విషా” | దేవా ఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ధ్మశ్శధ్ధవిః ||

పంచామృత స్నానం

 పాలతో

 ఆప్యాయస్వ సమేతుతే విశతస్సోమవృష్టియం|

భవావాజస్య సంగధే|| ||క్షీరేణ స్నపయామి||


పెరుగుతో

 దధిక్రావ్‌ణ్ణో అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః |

సురభినో ముఖాకరత్ర్పణ ఆయుగ్ంషి తారిషత్ || ||దధ్నా స్నపయామి ||

నేతితో

 శుక్రమసి జ్యోతిరసి తేజో௨సి దేవోవస్సవితో త్ప్నా|

 త్వఛ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః|| || ఆఙ్యేన స్నపయామి ||


తేనెతో

మధువాతా ఋతాయతే మధిక్షరంతి సింధవః|మాధ్వీర్న స్సంత్యోషధీః మధునక్త ముతోషసి||

మధుమత్పార్థివగ్ం రజః మధుద్యౌరస్తునః| పితా మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః|| || మధునా స్నపయామి ||


శర్కరతో

 స్వాధుఃపవస్య దివ్యయ జన్మనే స్వాదురింద్రాయ సుహావీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః ||శర్కరయా స్నపయామి ||
శుద్ధోధకముతో

 అపోహిష్ఠా మయోభువఃతాన ఊర్జేదధాతన మహేరణాయచక్షుసే యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః ఉశతీరివమాతరః తస్మారంగమామవః యస్యక్షయాయ జిన్వధ అపోజనయధాచనః

శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనశ్చ’ మే ద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే ంతా చ’ మే ర్తా చ’ మేక్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే ంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే యశ్చ’ మ తం చ’ మే‌உమృతం’ చ మేஉయక్ష్మం మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం  మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| స్నానం సమర్పయామి || || 7 ||

|| స్నానాతరే సుధఆచమనీయం సమర్పయామి ||

వస్త్ర్రం

ప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః ప్త మిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం శుమ్ ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| వస్త్ర్రయుజ్ఞ్మం సమర్పయామి || || 8 ||

యజ్ఞోపవీతం

తం ఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |
తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||

యజ్ఞోపవీతం పరమం పవిత్రం | ప్రజాపతేర్యసహజం పురస్తాత్ ||

ఆయుష్యమగ్ర్యం ప్రతిముచ శుభ్రం|యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

ఇదంవిష్ణుర్విచక్రమేత్రేదానితదేపదంసముద్రమస్యపాగుంసురే||

|| యజ్ఞోపవీతాం ధారయామి || || 9 ||

గంధం

తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
శూగ్-స్తాగ్‍శ్చ’క్రే వావ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| శ్రీ గంధం ధారయామి || || 10 ||

ఆబరణం

తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్‍మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

||ప్రధమ ఆబరణం సమర్పయామి || || 11 ||

పుష్పై పూజయామి

స్మాదశ్వా’ అజాయంత | యే కే చో’యాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’ ||

అధ అంగపూజ

శ్రీ విష్ణు అష్టోత్తర శత నామావళి

ఓం విష్ణవే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం వషట్కారాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం వృషాకపయే నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం దీనబంధవే నమః ।
ఓం ఆదిదేవాయ నమః ।
ఓం అదితేస్తుతాయ నమః ।
ఓం పుండరీకాయ నమః (10)

ఓం పరానందాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పరశుధారిణే నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం కలిమలాపహారిణే నమః ।
ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం నారాయణాయ నమః (20)

ఓం హరయే నమః ।
ఓం హరాయ నమః ।
ఓం హరప్రియాయ నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం వైకుంఠాయ నమః ।
ఓం విశ్వతోముఖాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం అప్రమేయాత్మనే నమః ।
ఓం వరాహాయ నమః ।
ఓం ధరణీధరాయ నమః (30)

ఓం వామనాయ నమః ।
ఓం వేదవక్తాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం విరామాయ నమః ।
ఓం విరజాయ నమః ।
ఓం రావణారయే నమః ।
ఓం రమాపతయే నమః ।
ఓం వైకుంఠవాసినే నమః (40)

ఓం వసుమతే నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధరణీధరాయ నమః ।
ఓం ధర్మేశాయ నమః ।
ఓం ధరణీనాథాయ నమః ।
ఓం ధ్యేయాయ నమః ।
ఓం ధర్మభృతాంవరాయ నమః ।
ఓం సహస్రశీర్షాయ నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః (50)

ఓం సహస్రపాదే నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం సర్వవిదే నమః ।
ఓం సర్వాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం సాధువల్లభాయ నమః ।
ఓం కౌసల్యానందనాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం రక్షసఃకులనాశకాయ నమః ।
ఓం జగత్కర్తాయ నమః (60)

ఓం జగద్ధర్తాయ నమః ।
ఓం జగజ్జేతాయ నమః ।
ఓం జనార్తిహరాయ నమః ।
ఓం జానకీవల్లభాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం జయరూపాయ నమః ।
ఓం జలేశ్వరాయ నమః ।
ఓం క్షీరాబ్ధివాసినే నమః ।
ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః ।
ఓం శేషశాయినే నమః (70)

ఓం పన్నగారివాహనాయ నమః ।
ఓం విష్టరశ్రవసే నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం మథురానాథాయ నమః ।
ఓం ముకుందాయ నమః ।
ఓం మోహనాశనాయ నమః ।
ఓం దైత్యారిణే నమః ।
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః (80)

ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః ।
ఓం నృసింహాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం శుద్ధాయ నమః ।
ఓం నరదేవాయ నమః ।
ఓం జగత్ప్రభవే నమః ।
ఓం హయగ్రీవాయ నమః ।
ఓం జితరిపవే నమః (90)

ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం రుక్మిణీపతయే నమః ।
ఓం సర్వదేవమయాయ నమః ।
ఓం శ్రీశాయ నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం సౌమ్యప్రదాయ నమః ।
ఓం స్రష్టే నమః ।
ఓం విష్వక్సేనాయ నమః (100)

ఓం జనార్దనాయ నమః ।
ఓం యశోదాతనయాయ నమః ।
ఓం యోగినే నమః ।
ఓం యోగశాస్త్రపరాయణాయ నమః ।
ఓం రుద్రాత్మకాయ నమః ।
ఓం రుద్రమూర్తయే నమః ।
ఓం రాఘవాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః (108)

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

||నానావిధ పరిమళ పత్ర పూష్పాక్షత కుంకుమైశ్చ పూజయామి || || 11 ||

ధూపంమాగ్రాపయామి

యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| ధూపంమాగ్రాపయామి || || 12 ||

దీపం దర్శయామి

బ్రాహ్మణో”உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’న్యః’ కృతః |
రూ తద’స్య యద్వైశ్యః’ | ద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| దీపం దర్శయామి || || 13 ||

|| ధూప దీపానంతరం సుధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం

ంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||

ఓంభూర్భూవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి

అమృతమస్తు అమృతోపస్తరణమసి

|| శ్రీ విష్ణు నమో నమః నైవేద్యం సమర్పయామి||

ఓం ప్రాణయస్వాహా

ఓం అపానాయ స్వాహా

ఓం వ్యానాయ స్వాహా

ఉదానాయ స్వాహా

ఓం సమనాయ స్వహా

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

సధ్యోజాతముఖాయైస్వాహా

వామదేవముఖాయైస్వాహా

అఘోరముఖాయైస్వాహా

తత్పురుషముఖాయైస్వహా

ఈశానముఖాయైస్వాహా

భ్రహ్మణేస్వాహా

 భ్రహ్మాణ్యైస్వాహా

 అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి

 హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్-రక్షాళయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం

నాభ్యా’ ఆసీంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
ద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||

పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం

ఇదంవిష్ణుర్విచక్రమే త్రేదానితదేపదం సముద్రమస్యపాగుంసురే||

|| తాంబూలం సమర్పయామి || || 14 ||

|| తాంబూల చర్వనాతరంసుధ ఆచమనీయం సమర్పయామి ||

వేదాహమే’తం ఇతి కర్పూర నీరాజనం

వేదాహమే’తం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’స్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వాஉభిదన్, యదా‌உ‌உస్తే” ||

సాంమ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం| పారమేష్టిగ్ంరాజ్యం మహారాజ్యమాధిపధ్యం||

|| నీరాజనం నాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి || || 15 ||

మంత్ర పుష్పం

ధాతా పుస్తాద్యము’దాహార’ | క్రః ప్రవిద్వాన్-ప్రదిశ్చత’స్రః |
మేవం విద్వామృత’ హ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||

ఙ్ఞేన’ ఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రమాన్యా’సన్ |
తే  నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||

ద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
స్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’మగ్రే” ||

వేదామేతం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
మేవం విద్వామృత’ హ భ’వతి | నాన్యః పంథా’ విద్యతే‌உయ’నాయ ||

ప్రజాప’తిశ్చరతి గర్భే’ ంతః | జాయ’మానో బహుధా విజా’యతే |
స్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం దమిచ్ఛంతి వేధసః’ ||

యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచా బ్రాహ్మ’యే ||

రుచం’ బ్రాహ్మం నయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
స్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అన్ వశే” ||

హ్రీశ్చ’ తే క్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | శ్వినౌ వ్యాత్తమ్” |
ష్టం మ’నిషాణ | ముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ ||

ఓం || సహస్రశీర్’షం దేవం విశ్వాక్షం’ విశ్వశం’భువమ్ | విశ్వం’ నారాయ’ణం దేవమక్షరం’ పమం పదమ్ | విశ్వతః పర’మాన్నిత్యం విశ్వం నా’రాణగ్‍మ్ హ’రిమ్ | విశ్వ’మేవేదం పురు’-స్తద్విశ్వ-ముప’జీవతి | పతిం విశ్వ’స్యాత్మేశ్వ’రగ్ం శాశ్వ’తగ్‍మ్ శివ-మచ్యుతమ్ | నారాణం మ’హాఙ్ఞేయం విశ్వాత్మా’నం రాయ’ణమ్ | నారాణప’రో జ్యోతిరాత్మా నా’రాణః ప’రః | నారాణపరం’ బ్రహ్మ తత్త్వం నా’రాణః ప’రః | నారాణప’రో ధ్యాతాధ్యానం నా’రాణః ప’రః | యచ్చ’ కించిజ్జగత్సర్వం దృశ్యతే” శ్రూతే‌உపి’ వా ||

అంత’ర్బహిశ్చ’ తత్సర్వం వ్యాప్య నా’రాణః స్థి’తః | అనంమవ్యయం’ విగ్‍మ్ స’ముద్రే‌உంతం’ విశ్వశం’భువమ్ | పద్మకోశ-ప్ర’తీకాశగ్ం హృదయం’ చాప్యధోము’ఖమ్ | అధో’ నిష్ట్యా వి’తస్యాతే నాభ్యాము’పరి తిష్ఠ’తి | జ్వాలమాలాకు’లం భాతీ విశ్వస్యాయ’నం మ’హత్ | సంతత’గ్‍మ్ శిలాభి’స్తు లంత్యాకోసన్ని’భమ్ | తస్యాంతే’ సుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్” ర్వం ప్రతి’ష్ఠితమ్ | తస్య మధ్యే’ హాన’గ్నిర్-విశ్వార్చి’ర్-విశ్వతో’ముఖః | సో‌உగ్ర’భుగ్విభ’జంతిష్ఠ-న్నాహా’రమరః విః | తిర్యగూర్ధ్వమ’ధశ్శాయీ శ్మయ’స్తస్య సంత’తా | తాపయ’తి స్వం దేహమాపా’దతమస్త’కః | తస్యధ్యే వహ్ని’శిఖా ణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖే భాస్వ’రా | నీవాశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే రమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిఃసేంద్రః సో‌உక్ష’రః పమః స్వరాట్ ||

ఓం రాజాధిరాజాయ’ ప్రహ్య సాహినే” | నమో’ యం వై”శ్రణాయ’ కుర్మహే | స మే కామాన్ కా కామా’ మహ్యమ్” | కామేశ్వరో వై”శ్రణో ద’దాతు | కుబేరాయ’ వైశ్రణాయ’ | మహారాజా నమః’ ||

ఓం” తద్బ్రహ్మ | ఓం” తద్వాయుః | ఓం” తదాత్మా |
ఓం” తద్సత్యమ్ | ఓం” తత్సర్వమ్” | ఓం” తత్-పురోర్నమః ||

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్‍మ్ 
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం’ ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతీరసో‌உమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణో‌உధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ |

తద్విష్నోః పరమం పదగ్‍మ్ సదా పశ్యంతి
సూరయః దివీవచక్షు రాతతం తద్వి ప్రాసో
విపస్యవో జాగృహాన్ సత్సమింధతే
తద్విష్నోర్య-త్పరమం పదమ్ |

ఋతగ్‍మ్ త్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ | 
ర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పా వై నమో నమః’ ||

ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి | 
తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ ||

|| మంత్ర పుష్పాజలింసమర్పయామి || || 16 ||

ఆత్మ ప్రదక్షణ

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ| తాని తాని వినశ్యంతి ప్రదక్షణ పదే పదే ||

పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాప సంభవ |పాహిమాం కృపయా గౌరీ శరణాగతవత్సలే ||

అన్యదాశరణంనాస్ధి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా ||

|| అనేన ఆత్మ ప్రదక్షణనమస్కారాంసమర్పయామి ||

సాష్ఠాంగదండప్రణమం ణామాని

ఉరసా శిరసా ద్రుశ్యా మనసా వచసా తద| పభ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామష్ఠగ మచ్చతే ||

|| అనేన సాష్ఠాంగదండప్రణమం ణామాని సమర్పయామి ||

అపరాధ నమస్కారం

అపరాధ సహస్రాణి క్రియంతేఅహర్నిశంమయా | దాశోహంఇతిమామత్త్వా క్షమస్వ పరమేశ్వరీ||

|| అనేన అపరాధ నమస్కారం సమర్పయామి ||

పునః పూజాం కరిష్యే

ఛత్రమాఛ్చాదయమి |చామరంవీచయామి ||

నృత్యందర్సయామి| గీతంశ్రావయామి ||

ఆందోళితానారోహయామి|అశ్వానరోహయామి||

గజానారోహయామి| సమస్థరాజోపచార భక్య్తుపచార శక్త్యుపచారాం సమర్పయామి||

||వాయుధ్యంఘోషయామి||

ఈశ్వరార్పణం


యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిఘు|
న్యూన్యం సంపూర్నతాం యాతి సద్యో వందే పరమేశ్వరీ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ|
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే||
అనయా యధాశక్తి పూజయా భగవతీ సర్వాత్మకః|


శ్రీ విష్ణు నమో నమః పాదారవిందార్పణమస్తు||

సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా | సర్వగుంహరతుమేపాపం దూర్వా దుఃస్వప్ననాశనీ ||

కాండాత్కాండాత్పరోహంతీ పరుషప్పరుషప్పరీ |ఏవానోదూర్వే ప్రతనుసహస్రేనశతేనచ||

యాశతేనప్రతనుసహస్రేన విరోహసి|తస్యాస్తే దేవీఇష్టకేవిధేమహవిషావయం||

అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతేవసుంధరా |శిరసాధార ఇష్యామి రక్షస్వమాం పదే పదే ||

ఋతగ్ఁ సత్యం పరంబ్రహ్మ పురషంకృష్ఙపింగళం| ఊర్ధ్వరేతంవిరూపాక్షంవిశ్వరూపాయవైనమః ||

గౌరీమిమాయసలిలీనిదక్షస్యేకపదీద్విపదీ సాచతుష్పదీ |అష్టాపదీ నవపదీ బహూషి సహస్రాక్షరా పరమేవ్యోమన్ ||

మమ వ్రతం సువ్వ్రతంమస్తు|నూనాతిరిక్తం సర్వం సగుణంకరొతు||

దేవ దేవ్యాః అనంత భోగో అన్తు|యత్ పాపం తత్ ప్రతిహతమస్తు||

అధర్మశ్య నాసోస్త| ధర్మశ్యవిజయోస్తు||

శత్రభిః ఆక్రమిత భారత భూభాగ స్వాయుక్తీ కరణ సిధిరస్తు ||

దేవ దేవ్యాః సకల సింహాసనేస్వర్యాఃరాజరాజేశ్వర్యాః పరబ్రహ్మణః పట్టమహిష్యాః

సారూప్య సామీప్య|| సాయుధ్యసిధ్ది ద్వారా మోక్షాధికారసిధ్ధిరస్తు||


క్షీరాబ్ది ద్వాదశి.. దూర్వాస ముహర్షికి గర్వభంగమైన రోజు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘బృందావని ద్వాదశి’గా పిలుస్తారు. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభ తిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీని శ్రీలక్ష్మీగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం, ఈరోజు దీపారాధన చేయడంవల్ల పరిహారమౌతుంది. క్షీరాబ్ది ద్వాదశి మహత్మ్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. శక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక, కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి... ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు. కాళిందీ నదీలో పుణ్యస్నానం చేసి, మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి, మహిమాన్వితమైన ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి, తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దూర్వాస మహార్షి అక్కడికి విచ్చేశాడు. దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దుర్వాసుడు తాను కాళిందిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్యబృందంతో సహా వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ పరావశ్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్లిపోయాడు. ద్వాదశి ఘడియలలో భుజిస్తే గాని వ్రత ఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచలను సాగించాడు. ‘‘దూర్వాసుడు నా అతిథి. అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి, శాపానికి గురి అవుతాను. అయితే, ద్వాదశ ఘడియలలో నేను పారాయణం చేయకపోతే, వ్రతఫలం దక్కదు, విష్ణువు కృప వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ ఘడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది. అతిథినీ గౌరవించినట్లవుతుంది. ఒకవేళ, అప్పటికీ ఆయన ఆగ్రహించి శపిస్తే, అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని’’ తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి, కేవలం జలాన్ని సేవించి, ముని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో నదీస్నానం ముగించుకుని వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిందని మహాపరాధంగా భావించాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై, జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీమహావిష్ణువును శరణఉ వేడాడు. భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి, దురహంకారియైన దూర్వాసుని వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించడం ఎవరి తరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్ధించగా.. దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని, అయననే శరణువేడటం మంచిదని విధాత సూచించాడు. దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి.. ‘నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని’ తెలిపాడు. శ్రీహరి సూచనతో దూర్వాసుడు... అంబరీషుని వద్దకు వెళ్లి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ధి ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగాగే, దీనికి అంబరీషుడు... ఓ మహర్షీ.. ఈ రోజు జరిగినవన్నీ భగవత్సంకల్పాలేనని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణుసన్నిధికి చేరింది. అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు.. ఈ రోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది.. క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిథి రోజు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందతారని అనుగ్రహించాడు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు అయిదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల నైవేద్యాలు, అయిదు రకాల పండ్లు, తాంబూలాలను సమర్పించాలి.